BJP leader Prabhakar open challenge To Harish Rao: కేంద్రం నిధులు ఇస్తేనే గానీ ఆదాయం సమకూర్చుకోలేని పరిస్థితిలో నేడు రాష్ట్రం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు రావాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావుకి ఆయన సవాల్ విసిరారు. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వ ఆదాయం ఆధారపడిందని విమర్శించారు. ఆర్థిక శాఖపై కనీసం సమీక్షలు సైతం నిర్వహించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రపతి, గవర్నర్‌లను సీఎం అవమానిస్తున్నారని మండిపడ్డారు.
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్దమా'.. హరీశ్‌రావుకు ప్రభాకర్ సవాల్ - Telangana Revenue
BJP leader Prabhakar open challenge To Harish Rao: మద్యం అమ్మకాలపైనే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆధారపడిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆరోపించారు. ఆర్థిక శాఖపై కనీసం సమీక్షలు సైతం నిర్వహించలేని దుస్థితి.. రాష్ట్రంలో నెలకొందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
Former BJP MLA Prabhakar
"తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దివాళా తీసింది. జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్‌లు ఆగ్రహం చెందుతున్నారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వ ఆదాయం ఆధారపడింది. భూమి అమ్మితే గానీ రాష్ట్రానికి ఆదాయం లేని పరిస్థితి ఈరోజు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తుంది. రాష్ట్రపతి విందులో సీఎం పాల్గొనకపోవడం ఆమెను అవమానించడమే."-ప్రభాకర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: