తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ భూముని ఎలా విక్రయిస్తారు..'

హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియోకు కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని సుపరిపాలనా వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని.... సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి, గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు.

'ఆ భూములు ఎలా విక్రయిస్తారు..'
'ఆ భూములు ఎలా విక్రయిస్తారు..'

By

Published : Feb 23, 2021, 4:22 AM IST

పద్మాలయ స్టూడియో భూములపై సుపరిపాలన వేదిక గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భూములు విక్రయించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 1983లో ప్రభుత్వం... పద్మాలయ స్టూడియో నిర్మాణానికి షేక్​పేటలో 9.5 ఎకరాల భూమిని... ఎకరాకు రూ.8,500 చొప్పున కేటాయించింది. ఇందులో ఎటువంటి వ్యాపారం చేయొద్దని, భూమిని అమ్ముకోవడానికి వీల్లేదనే నిబంధన ఉన్నట్లు సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి తెలిపారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉందని పద్మనాభరెడ్డి వివరించారు.

పద్మాలయ స్టూడియో... 5.53 ఎకరాల భూమిని జీ టెలీఫిల్మ్​కు ఎకరాకు 3కోట్ల చొప్పున విక్రయించారని.... దీనిని ధ్రువీకరిస్తూ హైదరాబాద్ కలెక్టర్ 2014లో ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లు పద్మనాభ రెడ్డి తెలిపారు. సీసీఎల్​ఏ దర్యాప్తులోనూ పద్మాలయ స్టూడియో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిందని వెల్లడించారు. భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సీసీఎల్ఏ కూడా సూచించినట్లు సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని పద్మనాభ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌

ABOUT THE AUTHOR

...view details