వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. అయినా ఏమీ పట్టకుండా హైదరాబాద్ నగర రహదారులపై వాహనదారులు యథేచ్ఛగా తిరగుతున్నారు.
బాధ్యత మరిచి ఫోన్లలో నిమగ్నమై.. - Hyderabad traffic rules news
వాహనాలను నడిపేటపుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం సరిగ్గా వెళుతున్నా.. ప్రమాదం ఎటునుంచి పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. కానీ హైదరాబాద్ నగరవాసికి ఇవేమి పట్టడం లేదు. వాహనాలపై ప్రయాణిస్తూ..ఫోన్లలో నిమగ్నమైపోతున్నాడు. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు.
phoneone
ట్రాఫిక్‌లోనూ.. ఫోన్ చూసుకుంటూ, మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతున్నారు. సామాజిక బాధ్యతను మరిచి వాహనాలపై తిరగడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వీరు ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతరులను సైతం ప్రమాదాలకు గురిచేసే అవకాశం ఉంది.