తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవుల అభివృద్ధికై విశ్రాంత అధికారుల సలహాలు - అడవుల అభివృద్ధి

అడవుల రక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని విశ్రాంత అటవీ అధికారులు సూచించారు. హైదరాబాద్​లో రిటైర్డ్​ అధికారులతో అటవీ శాఖ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో తమ సలహాలు, సూచనలు అందించారు. అంతరించిపోతున్న చెట్ల జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. హరితహారంలో నాణ్యమైన మొక్కలను మాత్రమే పంపిణీ చేయాలని అభిప్రాయపడ్డారు.

విశ్రాంత అధికారుల సమావేశం

By

Published : Jul 9, 2019, 9:38 PM IST

అడవుల అభివృద్ధికై విశ్రాంత అధికారుల సలహాలు

సహజ అటవీ రక్షణకు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని విశ్రాంత అటవీ అధికారులు సూచించారు. హైదరాబాద్​లో రిటైర్డ్​ అధికారులతో అటవీ శాఖ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో అడవుల అభివృద్ధికై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అటవీ శాఖ తరపున చేపట్టిన పథకాలు, కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. సామాజిక అడవుల పెంపకం, హరితహారం, అటవీ భూముల ఆక్రమణలు, సిబ్బంది రక్షణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

మంచి పరిణామం

అడవుల రక్షణకై గతంలో ఎవ్వరూ ఇవ్వని ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని... ఇది మంచి పరిణామమని విశ్రాంత అధికారులు అభివర్ణించారు. స్థానిక భూముల్లో పెరిగే అటవీ చెట్ల జాతులను అభివృద్ది చేయాలని... హరితహారంలో నాణ్యమైన మొక్కలను మాత్రమే పంపిణీ చేయాలని వారు సూచించారు.

ఇదీ చూడండి : అధిక వాయు కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్​

ABOUT THE AUTHOR

...view details