భారత్ బయోటెక్‌ను సందర్శించిన విదేశీ రాయబారులు, హై కమిషనర్లు - BHARAT Biotech Chairman Speech

13:05 December 09
భారత్ బయోటెక్‌ను సందర్శించిన విదేశీ రాయబారులు, హై కమిషనర్లు
హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పర్యటిస్తున్నారు. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థను ఈ బృందం సందర్శించింది. కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. దేశంలో కరోనా టీకాల పురోగతిని ఈ విదేశీ ప్రతినిధుల బృందం తెలుసుకుంటుంది.
రాయబారుల పర్యటనను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసింది. రెండు బృందాలుగా టీకాల పురోగతిని తెలుసుకుంటోంది. శామీర్‌పేటలోని జీనోమ్‌వ్యాలీకి రాయబారుల బృందాలు వెళ్లాయి. భారత్ బయోటెక్‌ను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. టీకాల తయారీపై దృశ్యరూపక ప్రదర్శనను తిలకించారు. రాయబారులకు కొవాగ్జిన్ వివరాలు భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా వెల్లడించారు.
భారత్ బయోటెక్‌ను ఎందరో ప్రముఖులు సందర్శించారు. పది రోజుల క్రితం ప్రధాని మోదీ కూడా సందర్శించారు. టీకా రంగంలో భారత్ బయోటెక్ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. - కృష్ణ ఎల్లా,భారత్ బయోటెక్ ఛైర్మన్