తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థికవ్యవస్థ గాడిలో పెట్టేందుకే బడ్జెట్​: కేంద్రమంత్రి జైశంకర్ - foreign affairs minister jai shankar recent news

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థితి కుదేలయ్యిందని... విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే కేంద్ర బడ్జెట్ అని అన్నారు.

ఆర్థికవ్యవస్థ గాడిలో పెట్టేందుకే బడ్జెట్​:కేంద్రమంత్రి జైశంకర్
ఆర్థికవ్యవస్థ గాడిలో పెట్టేందుకే బడ్జెట్​:కేంద్రమంత్రి జైశంకర్

By

Published : Feb 6, 2021, 2:31 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకే.. కేంద్ర బడ్జెట్​ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో ప్రసంగించిన ఆయన.. వైద్యం, ఆరోగ్య అంశాల్లో దేశం ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. త్వరలోనే రెండంకెల వృద్ధి సాధిస్తామని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థితి కుదేలయ్యిందన్నారు. కొవిడ్​ మన ఆలోచనలు, మనుగడను ప్రభావితం చేసిందని జైశంకర్ అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక నిధులు కేటాయించామని అన్నారు.

పారిశ్రామికంగా అనేక మందికి ఉపాధి దొరుకుతుందనీ, పారిశ్రామికంగా పుంజుకుంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. భవిష్యత్తుకు బడ్జెట్ కచ్చితమైన దిశానిర్దేశం చేసిందన్నారు. చాలా దేశాల్లో పర్యటించాననీ, అక్కడ తెలుగు వారే కనిపించారని జైశంకర్ అన్నారు. తెలుగు వారు తెలివైన వారు, కష్ట జీవులు అని విదేశాంగ మంత్రి కితాబునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details