తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధే లక్ష్యం... బల్దియా పీఠమెక్కిన మహిళామణులు - Ghmc news

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ అగ్ర పీఠాలను తొలిసారి మహిళామణులు దక్కించుకున్నారు. మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి తెరాస సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు కూతురుకాగా ఉప మేయర్‌గా గెలుపొందిన మోతె శ్రీలత తార్నాక డివిజన్‌ నుంచి గెలుపొందారు.

అభివృద్ధే లక్ష్యం... బల్దియా పీఠమెక్కిన మహిళామణులు
అభివృద్ధే లక్ష్యం... బల్దియా పీఠమెక్కిన మహిళామణులు

By

Published : Feb 11, 2021, 7:54 PM IST

అభివృద్ధే లక్ష్యం... బల్దియా పీఠమెక్కిన మహిళామణులు

గ్రేటర్‌ అగ్ర పీఠాలను తొలిసారి మహిళలు కైవసం చేసుకున్నారు. కొన్ని నెలలుగా హైదరాబాద్‌ మేయర్‌ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తెరాస సీనియర్‌ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్‌ ప్రథమ మహిళగా ఎంపికయ్యారు. బంజారాహిల్స్‌ నుంచి కార్పొరేటర్‌గా రెండుసార్లు విజయలక్ష్మి గెలిచారు.

విద్యాభ్యాసం...

విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. ప్రాథమిక విద్య హైద‌రాబాద్‌ హోలీమేరి పాఠశాలలో పూర్తిచేశారు. రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్‌ ఉల్‌ లూమ్‌ న్యాయ కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించారు. వివాహానంతరం ఆమె 18 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో సహాయక పరిశోధకురాలిగా పనిచేశారు.

అభివృద్ధి పథంలో తీసుకెళతా...

2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో తెరాస తరఫున భారీ మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి డివిజన్‌ అభివృద్ధికి తనవంతు పాత్ర పోషిస్తున్నారు విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికవడం పట్ల విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్న విజయలక్ష్మి... అన్ని పార్టీల సభ్యులను కలుపుకుని నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళతానని తెలిపారు.

నగరవాసులకు అందుబాటులో...

జీహెచ్ఎంసీ ఉపమేయర్‌గా మోతె శ్రీలత ఎన్నికయ్యారు. తార్నాక డివిజన్‌ నుంచి గెలిచిన ఆమె తెరాస సీనియర్‌ నేత మోతె శోభన్‌ రెడ్డి భార్యామణి. కొంతకాలం పాటు తెరాస మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో తెరాస ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో శ్రీలత భర్త మోతె శోభన్‌ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. అధినేత కేసీఆర్​కు వెన్నంటి ఉండి క్లిష్ఠ పరిస్థితుల్లోనూ నాయకుడికి అండగా నిలబడ్డారు.

ఉపమేయర్‌ పదవి గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించిన మోతె శ్రీలత నగరవాసులకు అందుబాటులో ఉంటూ... గ్రేటర్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇద్దరు మహిళామణుల సారథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్ కార్పొరేషన్‌ అభివృద్ధి మరింత పరుగులు పెట్టాలని పలు పార్టీల నాయకులు ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్‌ పీఠం

ABOUT THE AUTHOR

...view details