తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2020, 8:03 AM IST

ETV Bharat / state

మొదటిసారిగా బాణసంచా పేల్చకుండా దీపావళి పండగ

మొదటిసారిగా బాణసంచా పేల్చకుండా పండగ జరగబోతుంది. బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని గురువారం ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనితో రూ.200 కోట్ల వ్యాపారం నిలిచిపోనుంది.

For the first time Diwali is a festival without fireworks
మొదటిసారిగా బాణసంచా పేల్చకుండా దీపావళి పండగ

మహా నగరంలో తొలిసారిగా బాణసంచా మోత లేకుండా దీపావళి పండగ జరగబోతోంది. కరోనా నేపథ్యంలో వీటి పొగ నుంచి జాగ్రత్తగా ఉండాలని, సాధారణ రోగులు కూడా శ్వాసకోస సంబంధ సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వైద్యులు హెచ్చరిస్తున్నారు. బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని గురువారం ఉన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో శుక్రవారం నుంచి అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కొవిడ్‌ వచ్చి తగ్గినవారు బాణసంచా పొగను పీలిస్తే మరింత సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పల్మనాలజిస్టులు చెబుతున్నారు. ఈ వ్యాధి రానివారు పీల్చినా కూడా ఆరోగ్య పరంగా అంతమంచిది కాదని తెలిపారు. ఇక లాక్‌డౌన్‌లో

తగ్గిన కాలుష్యం గత రెండు నెలలుగా పెరిగింది. దీపావళికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని పీసీబీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాణసంచా నిషేధంతో కాలుష్యం కొంతమేర అదుపులో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వారి పరిస్థితేమిటి?

హైదరాబాద్​ నగరంలో 170 వరకు శాశ్వత బాణసంచా విక్రయ కేంద్రాలున్నాయి. అధికంగా చైనా, శివకాశి నుంచి సరకు వస్తుంటుంది. ఏటా రూ.200 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగింది రూ.10 కోట్ల మించి లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బాణసంచా వినియోగాన్ని నియంత్రించాలని హరిత ట్య్రైబ్యునల్‌ కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారం హైకోర్టు కూడా బాణసంచాను నిషేధించింది. తాము కోట్లాదిరూపాయల సరకు తెచ్చామని.. తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాపారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

విక్రయాలకు అనుమతివ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీ మైదానంలోని క్రాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. గురువారం సభ్యులు మాట్లాడుతూ గత 50 ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నామన్నారు. నిషేధం చేసేటట్టు ఉంటే ఫైర్‌ అనుమతులు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. న్యాయస్థానం తీర్పు ఆరు నెలల కిందట వచ్చి ఉంటే హోల్‌సేల్‌ వ్యాపారులకు వెసులుబాటు ఉండేదన్నారు. తెచ్చిన సరుకులను ఎక్కడ నిల్వ చేయాలో తెలియడం లేదన్నారు. గోదాముల్లో ఉంచితే అక్రమమైందని సీజ్‌ చేసే ప్రమాదం ఉందన్నారు. రెండు రోజులు విక్రయాలు జరిపేందుకు అనుమతినిస్తే తమ సరుకులు అమ్ముడుపోయి అప్పులు తీరుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details