సికింద్రాబాద్‌లోని ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. సీతాఫల్మండి చిలకలగూడలో ఫుట్‌పాత్‌పై ఉన్న బండ్లను దుకాణాలను కూల్చివేశారు. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు.
ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా - latest news of foot path places cleaning by GHMC
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై బల్దియా కొరడా ఝళిపించింది. ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్న దుకాణాలను తొలగించారు. రేపు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు.
ఫుట్‌పాత్ ఆక్రమణలనుపై జీహెచ్ఎంసీ నజర్... కూల్చివేతకు శ్రీకారం
ఫుట్‌పాత్‌లపై ఉన్న జ్యూస్ బండ్లు, చాయ్ బండ్లు తొలగించారు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఆక్రమించుకొని వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి అనురాధ స్పష్టం చేశారు. నేడు రేపు నామాలగుండు, వారాశిగూడ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇదీ చూడండి: నగరంలో ఆధార్ సేవా తొలి కేంద్రం ప్రారంభం...