నిషేధిత రసాయనాలు వాడి పండ్లను మగ్గపెడుతున్న పండ్ల వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మార్కెటింగ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మగ్గపెట్టేందుకు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు.
పండ్ల మార్కెట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు - తెలంగాణ తాజా వార్తలు
హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది పండ్ల మార్కెట్ వ్యాపారులకు జరిమానాలు విధించారు.
food safety raids
ఈ సందర్భంగా మామిడి పండ్లను మగ్గపెట్టేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఇథలిన్ పౌడర్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఐదుగురు వ్యాపారులకు జరిమానాలు విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు వాడితే కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల
Last Updated : May 18, 2021, 9:47 PM IST