ఖమ్మానికి చెందిన రావి నారాయణ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అమెరికా వీసా పనుల కోసం హైదరాబాద్ వచ్చాడు. తనతోపాటు భార్య శ్రీవిద్య, ఇద్దరు కుమారులతో కలిసి బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో బసచేశాడు. 318 నెంబర్ గదిని వీళ్లకు కేటాయించారు.
ఈనెల 10 నుంచి అక్కడే ఉంటున్న రావి నారాయణ.. వీసా పనులు ముగియగానే తిరిగి వెళ్లాలనుకున్నాడు. ఇంతలోనే నలుగురు కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. రెండేళ్ల విహాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఏడేళ్ల వరుణ్‌తోపాటు రావి నారాయణ, శ్రీవిద్య ఆస్పత్రి పాలయ్యారు.
10వ తేదీ రాత్రి ఆహారం తీసుకున్నారు. వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అక్కడికి చేరుకున్న బంధువులు ఆస్పత్రికి తరలించగా రావి నారాయణ చిన్న కుమారుడు రెండు సంవత్సరాల విహాన్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్లో వీరు బసచేసిన గదిలో ఏవైనా విషపదార్థాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరిపారు. విహాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మానసరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్.. 2ఏళ్ల బాలుడు మృతి మానసరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్.. 2ఏళ్ల బాలుడు మృతి ఇదీ చూడండి:జమ్మూలో అగ్నిప్రమాదం-కుప్పకూలిన భవనం