హైదరాబాద్ బాగ్ అంబర్పేట డివిజన్లో వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు ఎక్కువగా నివసిస్తుంటారు. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక, సొంత ఊళ్లకు వెళ్లలేక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వలస కార్మికులకు ఒకపూట భోజన సదుపాయం - food facility for ambarpet migrant labor
హైదరాబాద్ అంబర్పేట్లో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికులకు అంబర్పేట్ డివిజన్ యూత్ వింగ్స్ అసోసియేషన్ ఆహారం సరఫరా చేస్తున్నారు.
వలస కార్మికులకు ఒకపూట భోజన సదుపాయం
వారి ఆకలి బాధను అర్థం చేసుకున్న అంబర్పేట్ డివిజన్ యూత్ వింగ్స్ అసోసియేషన్ లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఒకపూట భోజన సదుపాయం కల్పించడానికి ముందుకొచ్చారు.
కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని, వారికి తమ వంతు సాయం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు శంభు శ్రీకాంత్ తెలిపారు.