సికింద్రాబాద్ పరిధిలో గల బోయిన్పల్లి తారా ఫౌండేషన్‌లోని అనాథ పిల్లలకు ప్రమోద్ మోదీ అనే వ్యక్తి అన్నదానం చేశారు. తన కొడుకు సౌరవ్ మోదీ జ్ఞాపకార్థం అతని జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
'అనాథలకు సేవచేయడం కంటే సంతృప్తి లేదు' - Food Donate Secunderabad Boinpally Tara Foundation Orphans
సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి తారా ఫౌండేషన్‌లో గల అనాథ చిన్నారులకు ప్రమోద్ మోదీ అనే వ్యక్తి అన్నదానం చేశారు. తన కొడుకు సౌరవ్ మోదీ జ్ఞాపకార్థం అతని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రమోద్ మోదీ తెలిపారు.
బోయిన్‌పల్లిలో అనాథ చిన్నారులకు అన్నదానం
తన కుమారుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తారా ఫౌండేషన్ వద్ద ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనాథ పిల్లలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని ప్రమోద్ మోదీ అన్నారు. వారు చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, విద్యా సామగ్రిని వారికి అందజేసినట్లు ఆయన తెలిపారు.