సికింద్రాబాద్‌కు చెందిన భాజపా నేత రమేశ్.. కొవిడ్ రెండో దశ లాక్డౌన్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తోన్న పేదలకు.. నిత్యం భోజనాన్ని పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నేడు తన కుమారుడి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌లపై నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు - పేదలు ఆకలి బాధలు
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ భాజపా నేత.. గత కొద్ది రోజులుగా పేదలకు భోజనాన్ని పంపిణీ చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
![పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు food distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:03:18:1623148398-12059825-rice.jpg)
food distribution
పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మేడ్చల్ జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.