లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుతున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రోడ్డుపై జీవనం సాగిస్తోన్న వారిని ఆదుకుంటున్నారు.
సంక్షోభంలో పేదలకు అండగా మానవతావాదులు - Food_Distribution to poor people
దానాల్లో కెల్ల అన్నదానం గొప్పది అంటారు. స్వార్థంతో ఎవరి దారి వారే చూసుకుంటోన్న ప్రస్తుత కాలంలో.. ఆకలితో అలమటించే పేదలకు నిస్వార్థంగా సాయపడే వారూ ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఎంతో మంది మానవతావాదులు.. నిరుపేదల ఆకలి తీరుస్తూ వారి అవసరాలను గుర్తిస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. సంక్షోభంలో సాటి వారికి సాయం చేయడం తమకెంతో సంతృప్తినిస్తోందంటున్నారు.
Food Distribution
ఆపత్కాలంలో దిక్కులేక పస్తులుంటోన్న వారి ఆకలి తీర్చడమే తమ లక్ష్యమంటున్నారు ఆయా మానవతావాదులు. నిత్యం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో.. పేదలకు భోజనం ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తూ అండగా నిలుస్తున్నారు. విపత్కర సమయంలో మానవతావాదులంతా ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతగా సేవలు అందించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!