హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలోని 100 మంది జర్నలిస్టులకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలకు ఎప్పటికప్పడు సమాచారం చేరవేస్తూ ఇంతటి గడ్డుకాలంలోనూ తమప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధాన కర్తలుగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ - మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్‌రెడ్డి
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ప్రజలంతా ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కోరారు.
జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ
కారోనా మహమ్మారి నుంచి ప్రజలంతా సురక్షితంగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు మేరకు అందరూ రాత్రి 9గంటలకు 9 నిముషాలు పాటు లైట్లన్నీ ఆర్పీ దేశంలో ప్రజలంతా దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటాలని కోరారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి ముందడుగు వేయాలని సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్