కొవిడ్-19 వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల పేదలు, వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు మానవత్వంతో స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల అవస్థలు పడుతున్న వారికి తోడ్పాటు అందించేందుకు శ్రీల పార్క్ ప్రైడ్ కాలనీ వాసులు ముందుకు వచ్చారు. కాలనీ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో హైదరాబాద్ మియాపూర్‌లో స్థానిక పోలీసుల చేతుల మీదుగా నాలుగు వందల కుటుంబాలకు నిత్యావసరాలను, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
మియాపూర్‌లో పేదలకు నిత్యావసరాల పంపిణీ
లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక పస్తులుంటున్న నిరుపేదలకు శ్రీల పార్క్ ప్రైడ్ కాలనీ వాసులు అండగా నిలిచారు. హైదరాబాద్ మియాపూర్‌లో పేదలకు నిత్యావసర వస్తువులను, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసరాల పంపిణీ
లాక్‌డౌన్ వల్ల పస్తులుంటున్న పేదల ఆకలి తీర్చేందుకు... తమకు తోచిన సహాయాన్ని చేయాలనే ఆలోచనతోనే నిత్యావసరాలను పంచినట్లు కాలనీ అధ్యక్షుడు మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు.
ఇవీచూడండి:ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన
Last Updated : Apr 3, 2020, 11:38 PM IST