లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన నిరుపేద వలస కార్మికుల కష్టాలను చూసి దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెరాస నాయకుడు గణేష్.. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని వలస కార్మికులు, నిరుపేదలు, ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.
రైల్వే స్టేషన్లో వలస కార్మికులకు, నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ - శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ
రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికుల వెతలు అంతా ఇంతా కాదు. ఉదయం 6 నుంచి 10 గంటలలోపే ప్రయాణాలు చేయాలని షరతులు పెట్టడంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంది. దానికి తోడు ఆకలితో అలమటిస్తూ నిరుపేద వలస కూలీలు ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు మేమున్నామంటూ ముందుకొచ్చింది సికింద్రాబాద్‌లోని ఓ ఫౌండేషన్.
నిరుపేదలు, వలస కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో స్వగ్రామాలకు దారి పట్టిన వలస కార్మికులు పెద్ద ఎత్తున రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. అలాంటి వారికి ఆపన్న హస్తం అందిస్తూ తమ వంతుగా సేవా కార్యక్రమాల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్టు సంస్థ ఛైర్మన్ గణేష్ తెలిపారు. సామాజిక స్పృహతో నిరుపేదలకు, వలస కార్మికులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:ఆపత్కాలంలో సర్పంచ్ భర్త మానవత్వం.. తండ్రికి కూతురే తలకొరివి!