తెలంగాణ

telangana

పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీ

By

Published : Apr 15, 2020, 8:22 PM IST

జీహెచ్​ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు అరుంధతి యూత్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు శ్రమిస్తున్న కార్మికులకు తమకు తోచిన విధంగా సాయమందిస్తున్నామని అసోసియేషన్​ సభ్యులు తెలిపారు.

ఆహార పొట్లాల పంపిణీ
ఆహార పొట్లాల పంపిణీ

కరోనా కట్టడి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అరుంధతి యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను పంచి పెట్టారు. కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసుకొని సాయం చేస్తున్నారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, చింతల్‌ తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న భవన కార్మికులు, వలస కూలీలకు సైతం మధ్యాహ్నం భోజనం పంపిణీ చేస్తున్నారు. భోజనంతో పాటు అవసరమైన వారికి నిత్యావసరాలను అందిస్తున్నట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు దీన్ని కొనసాగిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details