హైదరాబాద్ శ్రీనగర్‌నగర్ కాలనీలోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో సువర్ణభూమి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. నెలరోజుల పాటు వేలాది మంది అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ప్రశంసించారు.
'వెంకన్న మండపంలో అయ్యప్ప భక్తులకు అన్నదానం' - FOOD DISTRIBUTION TO AYYAPPA DEVOTEES IN HYDERABAD
అయ్యప్ప భక్తులకు హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున వచ్చే భక్తులకు సువర్ణ భూమి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
అయ్యప్ప భక్తులకు అన్నదానం
ఇలాంటి కార్యక్రమంలో మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రతీ ఏడాది అయ్యప్ప భక్తుల కోసం అన్నదానం చేస్తున్నట్లు సువర్ణభూమి ఎండీ శ్రీధర్ తెలిపారు. దైవకార్యంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు శ్రీధర్ .
ఇవీ చూడండి : కార్తిక దీపాల వెలుగుల్లో మహిళలు
Last Updated : Nov 17, 2019, 6:45 PM IST