తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​లో యాచకులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ - హైదరాబాద్​లో ఆహార ప్యాకెట్లు అందజేత

సికింద్రాబాద్​లోని పేదలు, యాచకులకు ఓ ఛారిటబుల్ ఛైర్మన్​ ఆహార ప్యాకెట్లు అందించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి స్వీయ నింయంత్రణ పాటించాలని ఆయన కోరారు.

సికింద్రాబాద్​లో యాచకులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ
సికింద్రాబాద్​లో యాచకులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ

By

Published : Apr 20, 2020, 10:02 AM IST

సికింద్రాబాద్​లో రోడ్డు, ఫుట్​పాత్​లపై ఆకలితో అలమటిస్తున్న పేదలు, యాచకులకు వీఎన్​ఆర్​ ఛారిటబుల్​ ట్రస్ట్​ ఛైర్మన్​ వల్లం నవీన్​ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. బోయిన్​పల్లి, ట్యాంక్​బండ్​, మేడ్చల్ హైవే ప్రాంతంలో సుమారు 200 ఆహార ప్యాకెట్లను పేద ప్రజలకు అందజేసినట్లు ఆయన తెలిపారు.

లాక్ డౌన్ కొనసాగుతున్నందున రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు, రోడ్లపై ఉండే యాచకులకు దిక్కులేకుండా సతమతమవుతున్నారని.. వారి కడుపు నింపేందుకు తాను ఆహారం అందించినట్లు నవీన్​ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి స్వీయ నియంత్రణ, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ABOUT THE AUTHOR

...view details