తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబర్‌పేట్‌లో అన్నదాన కార్యక్రమం - durga bhavani association food supply for poor people

అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని తులసిరాం నగర్‌ బస్తీలో నివాసం ఉంటున్న పేదలకు దుర్గాభవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు.

Annadanam
Annadanam

By

Published : Apr 7, 2020, 9:03 PM IST

Updated : Apr 7, 2020, 11:08 PM IST

హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని తులసిరాం నగర్‌ బస్తీలో ఉంటున్న సుమారు 400 మంది వలస కార్మికులు, పేదలకు దుర్గాభవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. లాక్‌డౌన్ సందర్భంగా ఉపాధి లేక ఆకలితో ఎవరూ ఉండకూడదనే ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు అసోసియేషన్ కన్వీనర్​ దుబ్బాక ఈశ్వర్ బెస్త తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సంస్థ ప్రతినిధి సుధీర్​ బెస్త సూచించారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ... శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని గోల్నాక భాజపా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రామ్​ బెస్త విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు పాల్గొన్నారు.

అంబర్‌పేట్‌లో అన్నదాన కార్యక్రమం

ఇదీ చూడండి:కొవిడ్​ సంక్షోభంలో ప్రధానికి సోనియా 5 సూచనలు

Last Updated : Apr 7, 2020, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details