తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించండి' - హైదరాబాద్ రాజేంద్రనగర్

హైదరాబాద్ పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించకపోవడాన్ని నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

'వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించండి'

By

Published : Aug 22, 2019, 12:01 AM IST

హైదరాబాద్ రాజేంద్రనగర్​లోని పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులు మూడు రోజులుగా నిరసన బాట పట్టారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు యాజమాన్యం పాటించకపోవడాన్ని నిరసిస్తూ కళాశాలలో తరగతులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. వీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే ఫైనల్ బోర్డు పరీక్షలు రాయడానికి అర్హత వర్తిస్తుంది. కానీ, 4వ సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్‌కు వెళ్లే విద్యార్థుల్లో... ఇద్దరికి హాజరు శాతం తక్కువగా ఉన్నప్పటికీ... నిబంధనలకు విరుద్ధంగా ప్రమోట్ చేశారు. అదే తరహాలో ప్రధమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

'వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించండి'

ABOUT THE AUTHOR

...view details