Fog pass device for Train :ప్రతి సంవత్సరం శీతాకాలంలో పొగమంచు(Fogg) వాతావరణం వల్ల రైళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైళ్లు ప్రభావితమవుతున్నాయి. ఈ ఫాగ్ సీజన్లో రైలు కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు భారతీయ రైల్వే 19,742 ఫాగ్ పాస్ పరికరాలను ఆయా జోన్లకు అందజేశాయి. దక్షిణ మధ్య రైల్వేకు 1,120 ఫాగ్ పాస్ పరికరాలను అందజేశారు. ఫాగ్ పాస్ పరికరాలతో రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీఠ వేశామని రైల్వేశాఖ వెల్లడించింది.
Railway Fog Pass Device 2024 : ఫాగ్ పాస్ పరికరం జీపీఎస్ ఆధారిత నావిగేషన్ ద్వారా దట్టమైన పొగమంచు పరిస్థితుల్లో కూడా లోకో పైలట్‌కు(Loco Pilot) నావిగేట్ చేయడంలో సహాయపడుతుందని రైల్వేశాఖ వివరించింది. ఇది సిగ్నల్, లెవల్ క్రాసింగ్ గేట్ (మానవసహిత- మానవరహిత), శాశ్వత వేగ పరిమితులు, తటస్థ విభాగాలు మొదలైన స్థిర ల్యాండ్‌మార్క్‌ల స్థానానికి సంబంధించి లోకో పైలట్‌లకు ప్రయాణ కాలములో వాస్తవ సమాచారాన్ని డిస్ ప్లే-వాయిస్ గైడెన్స్ అందిస్తుంది. దాదాపు 500 మీటర్లకు ముందు భౌగోళిక (Geography) క్రమంలో తదుపరి మూడు రాబోవు స్థిర ల్యాండ్‌మార్క్‌ల సందేశాలను వాయిస్‌తో కూడిన సందేశాన్ని అందిస్తుంది.
ట్రైన్ ట్రాకింగ్ & లైవ్ వ్యూ వాకింగ్ - గూగుల్ మ్యాప్స్ నయా ఫీచర్స్!
ఫాగ్ పాస్ పరికరం యొక్క ప్రత్యేకతలు :సింగిల్ లైన్, డబుల్ లైన్, ఎలక్ట్రిఫైడ్(Electrified), నాన్-ఎలక్ట్రిఫైడ్ సెక్షన్లు వంటి అన్ని రకాల విభాగాలకు ఫాగ్ పాస్ పరికరం అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ఎలక్ట్రిక్, డీజిల్ లోకోమోటివ్‌లు, ఈ.ఎమ్.యూలు,మెములు, డెమూలకు ఇది అనుకూలం. గంటకు 160 కిలోమీటర్ల రైలు వేగానికి ఈ పరికరం అనుకూలంగా ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.