Fog in Hyderabad : భాగ్యనగరాన్ని కమ్మేసిన పొగమంచు - తెలంగాణ తాజా వార్తలు
Fog Covering the City of Hyderabad: హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కప్పేసింది. భాగ్యనగరమంతా సరికొత్త అందాలతో కనువిందుగా కనిపిస్తోంది. దీంతో ఉదయం 8 గంటలు అయినా నగరంలో పొగమంచు కురుస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చేంత వరకు కనిపించటం లేదని వాపోతున్నారు. మరోవైపు పొగమంచు అందాలు చూసి ప్రజలు సంబురపడుతున్నారు. తెల్లవారుజామునే లేచి కొంతమంది యువత ఫొటోలకు పోజులిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Fog Covering the City of Hyderabad