హైదరాబాద్ నగరంలో ఇవాళ్టి నుంచి మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయినందున పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. రూ.69.47 కోట్ల వ్యయంతో దీనిని..900 మీటర్ల పొడవున మూడు లేన్లుగా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌తో మెహిదీపట్నం, ఖాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా చేరుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
అందుబాటులోకి రానున్న మరో పైవంతెన
హైదరాబాద్ వాసులకు మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ సమీపంలోని పైవంతెనను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు.
నగరవాసులకు అందుబాటులోకి రానున్న మరో పైవంతెన