దీపావళి సందర్భంగా నగరంలోని పూల మార్కెట్లు సందడిగా మారాయి. కొనుగోలుదారులతో మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. పువ్వుల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కిలో బంతి 70 నుంచి 100 రూపాయలు ఉంది. చేమంతి రూ.200, గులాబీలు 250 చొప్పున విక్రయిస్తున్నారు.
పండుగవేళ కిక్కిరిసిన పూల మార్కెట్లు - తెలంగాణ వార్తలు
దీపావళి పర్వదినం వేళ... పూల మార్కెట్ కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాల్లో పూల మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. పెద్ద ఎత్తున పువ్వులు కొనుగోలు చేస్తున్నారు.
పండుగవేళ కిక్కిరిసిన పూల మార్కెట్లు
పూల దండ 1000 నుంచి 1200 రూపాయలు పలుకుతోంది. ధరల పెరుగుదలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, లాక్డౌన్ వల్ల నష్టపోయిన రైతులకు పండుగ ఊరటనిచ్చింది. గతేడాదితో పోల్చితే... ఈ సారి మార్కెట్‌లో తీరొక్క పూలు పుష్కలంగా ఉన్నా... ధరలు మాత్రం మండిపోతున్నాయని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:రాత్రి 8-10 వరకు 'గ్రీన్ టపాసులు' కాల్చేందుకు అవకాశం