లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు తగ్గిపోయాయి. కొన్నిచోట్ల వివాహాలు జరుగుతున్నా.. నిరాడంబరంగానే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పూలకు డిమాండ్ పడిపోయింది.
కరోనా ప్రభావం: పూలు... పశువులపాలు - తెలంగాణ వార్తలు
కరోనా ప్రభావంతో శుభకార్యాలు చాలావరకు తగ్గిపోయాయి. ఒకవేళ జరిగినా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూల డిమాండ్ పడిపోయింది. సహజంగా వేసవిలో వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. పూల ధరలూ ప్రియంగానే ఉండేవి. కానీ మహమ్మారితో పరిస్థితి తలకిందులైంది. శుభకార్యాల్లో కళకళలాడాల్సిన పూలు ఇలా పశువుల పాలయ్యాయి.

పడిపోయిన పూల మార్కెట్, పశువుల పాలైన పూలు
హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్‌కు రైతులు తెచ్చిన పూలను కొనుగోలు చేసే వారు లేక పక్కనే పారబోశారు. అక్కడ తిరిగే పశువులు వాటిపై పడుకుని సేదదీరుతూ ఇలా కనిపించాయి. వివాహాది వేడుకల్లో కళకళలాడాల్సిన పుష్పాలు ఇలా పశువుల పాలయ్యాయి.
ఇదీ చదవండి:బయటపడుతున్న లక్షణాలు... చిన్నారులకు ఎంఐఎస్ ముప్పు!