ఏపీలోని గుంటూరు పట్టణం శ్యామలానగర్లోని ఓ ఇంట్లో రంగులు మార్చే పుష్పం కనువిందు చేస్తోంది. ఉదయం 7 గంటలకు తెల్లగా ఉన్న ఈ పత్తిమందారం పువ్వు.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి లేత గులాబీరంగులోనూ.. 3 గంటల సమయానికి పూర్తిగా గులాబీరంగులోకి మారిపోతోంది. విశ్రాంత ఉద్యోగి భాస్కరరావు ఇంట్లో పెరుగుతున్న ఈ మొక్కను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పత్తి మందారం.. పూటకో వర్ణం - ap news
ఒకే మొక్కకు వేర్వేరు రంగుల్లో పూలు పూయడం మనం చూస్తుంటాం. కానీ ఏపీలోని గుంటూరు పట్టణం శ్యామలానగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి భాస్కరరావు ఇంటిలోని పత్తి మందారం మొక్కకు పూసిన పూలు మాత్రం ఒకే రోజులో వేర్వేరు రంగులు మారుతూ ఆకట్టుకుంటున్నాయి.
పత్తి మందారం.. పూటకో వర్ణం
పత్తిలో 50 రకాల జాతులున్నాయని.. అందులో వైల్డ్ స్పీసెస్ పేరుతో శాస్త్రీయంగా ఈ మొక్కను పిలుస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఆంథోసయానిన్ అనే వర్ణ ద్రవ్యకం కారణంగా తొలుత తెలుపు, తర్వాత లేత గులాబి, ఆ తర్వాత ముదురు గులాబి రంగుల్లోకి మారుతుంటాయని తెలిపారు.
ఇవీ చదవండి:కెరీర్ కోసం విదేశీ భాషలపై తెలుగు యువత పట్టు