భాగ్యనగరవాసులు భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సరూర్‌నగర్ చెరువు పూర్తిగా నిండిపోయి బండ్‌పై నుంచి ప్రవహరిస్తోంది. వరదతో దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీరు పీఅండ్‌టీ కాలనీ, సాయిబాబా దేవాలయం ముందు నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపైకి చేరి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరద నీటిలో కాలనీలు.. ఇబ్బందుల్లో ప్రజలు - హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సరూర్‌నగర్ చెరువు పూర్తిగా నిండిపోయి బండ్‌పై నుంచి ప్రవహరిస్తోంది. వరదతో దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి.
![వరద నీటిలో కాలనీలు.. ఇబ్బందుల్లో ప్రజలు floods at dilsukhnagar in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9172596-thumbnail-3x2-rain.jpg)
వరద నీటిలో కాలనీలు.. ఇబ్బందుల్లో ప్రజలు
సరూర్‌నగర్ ట్యాంక్ బండ్ ఎగువ ప్రాంతాల నుంచి నీరు దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీనగర్ కాలనీ, కమలానగర్ కాలనీలు పూర్తిగా ముంచెత్తాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొందరు స్థానికులు ఎగువ నుంచి నీటి ప్రవాహం రాకుండా ఇసుక బస్తాలు వేసి అడ్డుకునే ప్రయత్నంలో రాత్రంతా కాపలా కాస్తూ రోడ్లపైనే పడిగాపులు పడాల్సి వచ్చింది.
వరద నీటిలో కాలనీలు.. ఇబ్బందుల్లో ప్రజలు
ఇదీ చదవండి:హైదరాబాద్‌కు సమీపంలో తీవ్ర వాయుగుండం