తెలంగాణ

telangana

ETV Bharat / state

సెల్లార్​లోకి వరద ప్రవాహం.. నీటమునిగిన వాహనాలు - Patelnagar rain news

Flood at Apartment Cellar : రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్​ నాంపల్లి పటేల్​నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లోకి వరద నీరు చేరింది. సెల్లార్​ పూర్తిగా నీటితో నిండిపోగా.. పార్కింగ్​లో నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. ఫలితంగా అపార్ట్​మెంట్​ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Flood at Apartment Cellar
అపార్ట్​మెంట్​లోకి వరద నీరు.. నీట మునిగిన సెల్లార్​

By

Published : Jul 26, 2022, 11:50 AM IST

అపార్ట్​మెంట్​లోకి వరద నీరు.. నీట మునిగిన సెల్లార్​

Flood Water at Apartment Cellar : హైదరాబాద్​లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నాంపల్లిలోని పలు కాలనీలు నీట మునిగాయి. గాంధీభవన్ వెనుక ఉన్న పటేల్​నగర్​లో ఓ అపార్ట్​మెంట్ సెల్లార్​ పూర్తిగా నీటితో నిండిపోయింది. పార్కింగ్​లో నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. ఇంటి నుంచి బయటకి వెళ్లలేని పరిస్థితి తలెత్తడంతో అపార్ట్​మెంట్​ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బయట నుంచి వరద నీరు వచ్చి తమ అపార్ట్​మెంట్​లోకి చేరుతుందని.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్, స్థానిక భాజపా కార్పొరేటర్​, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అపార్ట్​మెంట్​ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తమ అపార్ట్​మెంట్​లోకి నీరు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికీ వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details