తెలంగాణ

telangana

ETV Bharat / state

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన వరద బాధితులు - Hyderabad HRC

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను వరద బాధితులు ఆశ్రయించారు. మజ్లీస్ బచావో తెాహారిక్ పార్టీ ఆధ్వర్యంలో వరద నీటి వల్ల వెయ్యి కుటుంబాలకు పైగా ఇబ్బందులు పడుతున్నాయని కమిషన్​కు వివరించారు.

Flood victims who resorted to HRC in hyderabad
హెచ్​ఆర్సీని ఆశ్రయించిన వరద బాధితులు

By

Published : Nov 9, 2020, 7:47 PM IST

ఎంబీటీ ( మజ్లీస్ బచావో తెహారిక్ ) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను వరద బాధితులు ఆశ్రయించారు. ఇటీవల కురిసిన వర్షం వల్ల మహేశ్వరం నియోజకవర్గం జల్​పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్​నగర్, అహ్మద్​నగర్, సైఫ్ కాలనీలలో ఇప్పటికి నీరు నిలిచి ఉందని వారు పిటిషన్​లో పేర్కొన్నారు. వరద నీటి వల్ల వెయ్యి కుటుంబాలకు పైగా ఇబ్బందులు పడుతున్నాయని కమిషన్​కు వివరించారు.

ప్రభుత్వం ప్రకటించిన 10 వేల ఆర్థిక సహాయం అందించకుండా, తమ బస్తీలలో నిలిచిన వర్షం నీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కమిషన్​ను కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక్కసారి వచ్చి వెళ్లినప్పటికి... ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా వరద నీటిలో ఉండడంతో పిల్లలకు, తమకు రోగాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం బాధితులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని బాధితుల తరఫున ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్ హెచ్చార్సీను కోరారు.

ABOUT THE AUTHOR

...view details