సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మీసేవా సెంటర్ వద్ద వరద బాధితులు బారులు తీరారు. ఉదయం 8 గంటలకే లైన్లో నిల్చున్న మహిళలకు సాయంత్రం 4 గంటలకు దరఖాస్తు చేసుకునే వీలు కలిగింది.
అన్నదాతల అగచాట్లు... ఆర్థిక సాయానికి 'ఆన్లైన్' అవస్థలు - financial help to Hyderabad flood victims
సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మీసేవా సెంటర్ వద్ద వరద బాధితులు బారులు తీరారు. రూ.10 వేల ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెద్దసంఖ్యలో క్యూ కట్టారు.
అడ్డగుట్ట, తుకారాంగేట్, సీతాఫల్‌మండి, చిలకలగూడ, బేగంపేట్, రాణిగంజ్, మారేడుపల్లి, లాలాగూడ సికింద్రాబాద్ మోండా మార్కెట్ నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు బాధితులు తరలివచ్చారు. మీసేవా సెంటర్‌లో టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టారు. తీసుకున్న టోకెన్లు పనిచేయడం లేదని బాధితులు హైరానా పడ్డారు. సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉన్న మీసేవా సెంటర్లలో కొన్ని మూసివేయడం వల్ల అక్కడి వారు మారేడుపల్లి మీసేవా సెంటర్‌కు తరలివచ్చారు. వృద్ధులను క్యూ లైన్ లేకుండానే మారేడుపల్లి పోలీసులు నేరుగా లోపలికి పంపించారు. మీసేవా సెంటర్‌లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.