హైదరాబాద్ చంపాపేట్ డివిజన్ పరిధిలోని రెడ్డికాలనీ, రాజిరెడ్డినగర్, పద్మానగర్తోపాటు పలు కాలనీలకు చెందిన వరద బాధితులు... కార్పొరేటర్ రమణారెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తమకు వరద పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన - జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రమణారెడ్డి
తమకు పరిహారం అందలేదని హైదరాబాద్ చంపాపేట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన వరద బాధితులు కార్పొరేటర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. వరద బాధితులందరికీ సహాయం అందజేస్తామని కార్పొరేటర్ రమణారెడ్డి భరోసా ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.
కార్పొరేటర్ ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన
వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ సాయం అందజేస్తామని కార్పొరేటర్ రమణారెడ్డి హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం ప్రతి బాధిత కుటుంబానికి అందిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇదీ చదవండి:చెరువులు, నాలాల దురాక్రమణపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ