తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్హులకు ఆర్థిక సాయం అందించాలని వరద బాధితుల ధర్నా - జీహెచ్​ఎంసీ కార్యాలయంలో వరద బాధితుల ధర్నా

హైదరాబాద్​ అల్లాపూర్​ డివిజన్​లో వరద బాధితులు స్థానిక జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి అందించే ఆర్థిక సహాయం తమకు అందట్లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.

flood victims protest for finanicial assistance at allapur ghmc office
అర్హులకు ఆర్థిక సాయం అందించాలని వరద బాధితుల ధర్నా

By

Published : Oct 31, 2020, 6:54 PM IST

హైదరాబాద్​ సనత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అల్లాపూర్​ డివిజన్​లోని జీహెచ్​ఎంసీ వార్డు కార్యాలయం ఎదుట మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రూ. 10 వేల ఆర్థిక సహాయం తమకు అందలేదని వారు ఆందోళన చేశారు.

అల్లాపూర్​ డివిజన్​లోని వివేకానందనగర్​, తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అర్హులైన వారందరికీ అందించాలని డిమాండ్​ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details