హైదరాబాద్‌లో వరదసాయం అందలేదంటూ ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. ముషీరాబాద్ డివిజన్లోని పలు కాలనీల ప్రజలు పార్కు వద్ద భారీ ఆందోళన చేపట్టారు. తెరాస నాయకులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. నిత్యావసరాలు వరద నీటిలో మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ముషీరాబాద్‌లో వరద బాధితుల ఆందోళన
తమకు వరద సాయం అందలేదంటూహైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్లో బాధితులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముషీరాబాద్ పార్కు వద్ద భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఆర్థిక సాయం అందేవరకు పోరాటం చేస్తామని భాజపా నాయకులు మద్దతు ప్రకటించారు.
ముషీరాబాద్‌లో వరద బాధితుల ఆందోళన
వరద బాధితులు చేపట్టిన ఆందోళనకు ముషీరాబాద్ డివిజన్ భాజపా నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం నుంచి సాయం అందేవరకు పోరాటం కొనసాగిస్తామని భాజపా డివిజన్ కో కన్వీనర్ నవీన్ గౌడ్ తెలిపారు.