తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం! - ప్రకాశం బ్యారేజ్ తాజా వార్తలు

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీలో భారీగా నీటిమట్టం పెరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

వరద ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం!
వరద ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం!

By

Published : Sep 27, 2020, 1:19 PM IST

కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరగనుంది. ఫలితంగా వరద ప్రభావిత మండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. ఏపీలోని ప్రకాశం బ్యారేజి ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ నుంచి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 4,60,000 క్యూసెక్కులుగా ఉంది. వచ్చే వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది.

ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎవరూ బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని కోరారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:ముగ్ధ మనోహరం: మూసీ మురిపిస్తోంది.. కృష్ణా కనువిందు చేస్తోంది...

ABOUT THE AUTHOR

...view details