తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Assembly Sessions 2023 : వరద నష్ట తీవ్రతపై అసెంబ్లీలో ప్రకటన.. ఏయే రంగాల్లో ఎంత నష్టం వాటిల్లిందంటే?

Flood Damage Statement in Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా తెలంగాణను అతలాకుతలం చేసిన వరద నష్ట తీవ్రతపై శాసన మండలిలో ప్రభుత్వం ప్రకటన చేసింది. వరదల సమయంలో సుమారు 7వేల 870 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే వివిధ రంగాల్లో చోటు చేసుకున్న నష్టాలు, వాటి పునరుద్ధరణకు కేటాయించిన నిధులు గురించి సమగ్రంగా వివరించింది.

Flood Damage Statement in Telangana Assembly
Flood Damage Statement in Telangana Assembly

By

Published : Aug 3, 2023, 3:51 PM IST

Telangana Legislative Council Sessions 2023 : తెలంగాణ శాసనమండలి సమావేశాల సందర్భంగా వర్షం, వరదల నష్టంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. వర్షాల సమయంలో 139 గ్రామాలను తరలించి 157 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 7వేల 870 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుప్రభుత్వం వెల్లడించింది. వర్షాల తీవ్రత దృష్ట్యా.. 756 చిన్నతరహా సాగునీటి చెరువులకు కట్టలు తెగిపోయాయని పేర్కొన్నారు.

చెరువల పునరుద్ధరణ కోసం రూ.171.1కోట్లు తక్షణ పునరుద్ధరణ కోసం రూ.100 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. ఆర్​అండ్​బీ శాఖకు సంబంధించిన మొత్తం 768 రోడ్లు, 527 రాష్ట్ర రోడ్లు, 37 జాతీయ రహదారులు, 6 రాజీవ్ రహదారులు, 198 భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు 488 రాష్ట్ర రహదారులు, 29 జాతీయ రహదారులు పునరుద్ధరించామని స్పష్టం చేసింది. రహదారుల తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ. 253.77 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.1771.47 కోట్లు అవసరమని అంచనా వేసింది.

Prashanth Reddy statement on flood damage : పంచాయతీరాజ్​శాఖకు సంబంధించిన 1517 రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. వీటి తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.187.71 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం 1339.03 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.1526.74 కోట్లు మొత్తంగా అవసరమవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు 8వ తేదీ వరకు తాత్కాలిక పునరుద్ధరణ పనులుపూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

విద్యుత్​శాఖకు సంబంధించి 773 గ్రామాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా 769 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రూ. 62.98 కోట్లతో 23075 స్తంభాలు, 3405 డీటీఆర్​లకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 38 ఎద్దులు, 439 ఆవులు, 14 కోడెలు, 399 గొర్రెలు, 81129 కోళ్లు చనిపోయాయని వివరించింది.

మత్స్య పరిశ్రమకు సంబంధించి రూ.2.18 కోట్ల నష్టం, రూ. 16.71 కోట్ల ఆస్తుల నష్టం జరిగిందని వివరించింది. రూ. 38.51 కోట్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి అవసరం ఉందని తెలిపింది. భారీ వర్షాలకు 419 గృహాలు పూర్తిగా, 7505 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని పేర్కొంది. మున్సిపాలిటీలలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టు, వీధి దీపాల శాశ్వత పునరుద్ధరణ కోసం రూ. 380 కోట్లు అవసరం కాగా.. జీహెచ్ఎంసీలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.255.66కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం వివరించింది.

"వరదల సమయంలో 8 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచాం. మోరంచపల్లిలో హెలికాప్టర్, ఆర్మీని అందుబాటులోకి తెచ్చాం. 1500 మందిని అగ్నిమాపక బృందాలు కాపాడాయి. 139 గ్రామాలు వరద బారినపడ్డాయి. 27వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. 768 ప్రాంతాల్లో ఆర్అండ్‌బీ రోడ్లు కోతకు గురయ్యాయి. 773 గ్రామాలకు విద్యుత్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. 23వేల స్తంభాలు, 3వేల డీటీఆర్‌లు చెడిపోయాయి. ఇసుక మేటకు గురైన వ్యవసాయ భూములను అంచనా వేస్తున్నాం. దురదృష్టవశాత్తు కేంద్రం ఎటువంటి సాయం అందించలేదు. వరద నష్టానికి తక్షణ సాయం కింద రూ.500 కోట్లు అందజేశాం."- ప్రశాంత్‌రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details