రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసే వారికి వినూత్నరీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ నిర్వాహకులు. స్టాప్ స్పిట్టింగ్ ఇండియా లక్ష్యంతో హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం చేపట్టారు. రోటరీ క్లబ్, పలు ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన యువతి, యువకులు, పెద్దలు డాన్సులతో అదరగొట్టారు.
యువత ఫ్లాష్ మాబ్ డాన్సులు చేస్తూ ఉమ్మివేయడం ఆపండి అంటూ సందేశాన్నిచ్చారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ముఖ్యంగా యూత్ కృషి చేయాలని సూచించారు. బెంగళూరులో తాము చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని రోటరీ క్లబ్ సభ్యురాలు శ్రీదేవి తెలిపారు. హైదరాబాద్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు.