flag hosting at nampalli bjp office: రాష్ట్ర ప్రజలకు భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో 73వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరణ చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రజలకు ఒక భరోసా అని..... పాలకులకు మార్గనిర్దేశమని ఆయన వ్యాఖ్యానించారు.
'రాజ్యాంగం ప్రజలకు భరోసా... పాలకులకు మార్గనిర్దేశం' - బండి సంజయ్ వార్తలు
flag hosting at nampalli bjp office: ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గణతంత్ర వేడుకల్లో బండి సంజయ్
ప్రపంచంలోనే లేని గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్పవ్యక్తి అంబేడ్కర్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు.. అప్పటి నుంచే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన విషయం తెలిసిందేనన్నారు. ప్రపంచంలోనే ఓ గొప్ప దేశంగా.. అందరూ గుర్తిస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్