Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 5 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 67కు చేరుకుంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారిన పడిన 22 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Telangana omicron Cases: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా 5 కేసులు - కరోనా వైరస్ వార్తలు
Telangana omicron Cases: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా 5 కేసులు
20:02 December 30
రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు
280 కరోనా కేసులు
corona cases: మరోవైపు రాష్ట్రంలో 24 గంటల్లో 37,926 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 280 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఒకరు మృతి చెందారు. తాజాగా కొవిడ్ బారినపడిన మరో 206 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:
Last Updated : Dec 30, 2021, 8:34 PM IST