రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నారాయణగూడ పోలీస్స్టేషన్లోనూ కరోనా కలకలం రేగింది. ఓ మహిళా ఎస్సై, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఈ మహమ్మారి బారినపడ్డారు.
నారాయణగూడ పీఎస్‌లో ఐదుగురికి కరోనా - నారాయణగూడలో పోలీస్‌స్టేషన్‌లో కరోనా కలకలం వార్తలు
కొవిడ్-19 బారినపడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో మరో ఐదుగురికి ఈ మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా ఎక్కువవుతుండటం వల్ల మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

నారాయణగూడలో పీఎస్‌లో ఐదుగురికి కరోనా
మరోవైపు నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోనూ ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఓ హోంగార్డుకు ఈ వైరస్ సోకినట్లు వెల్లడైంది. ఫలితంగా వీరితో కలిసి విధులు నిర్వర్తించిన మిగిలిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
ఇదీచూడండి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా ఉద్ధృతం