క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్, సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలని పీవీ సింధు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకి వచ్చేవారు తప్పనిసరిగా మస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు.
'త్వరలో ఆన్లైన్లో ఫిట్నెస్ శిక్షణ తరగతులు' - pv sindhu
క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో పాత్రికేయులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్, సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో యువతకు రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వైరస్ నివారణకు సీఎం కేసీఆర్, కేటీఆర్లతోపాటు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 30 తరవాత లాక్‌డౌన్‌ను పొడిగించకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. త్వరలో యువతకు ఆన్లైన్లో యోగా, ఏరోబిక్స్ వంటి ఫిట్నెస్ తరగతులను నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి :చిట్టీ వసూళ్ల పేరుతో వేధింపులు వద్దు