మధుమేహం.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అనేక మందిని పట్టి పీడుస్తున్న సమస్య అని ఫిట్ ఫర్ లైఫ్ సంస్థ నిర్వాహకురాలు డా. దీపికా చలసాని తెలిపారు. ఒక్కసారి మధుమేహం సోకితే అది శరీరంలోనే అనేక అవయవాలపై దాని ప్రభావం చూపుతుందన్నారు. అలాంటి మధుమేహాన్ని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో టైప్ 2 రకం మధుమేహాన్ని అదుపు చేయటం, రివర్స్ చేయటం కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ఆమె తెలిపారు.
మధుమేహ నివారణకై... ఫిట్ ఫర్ లైఫ్ ఆన్లైన్ ప్రోగ్రాం
మధుమేహం నివారణకై ఫిట్ ఫర్ లైఫ్ సంస్థ ఓ ప్రత్యేక ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆ సంస్థ నిర్వాహకురాలు డా. దీపికా చలసాని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో సమావేశాన్ని నిర్వహించి ఆ కార్యక్రమం గురించి వివరించారు.
నవంబర్ 14 ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా నో డయాబెటిస్ గ్లోబల్ పేరుతో ఆన్లైన్ కార్యక్రమాన్నిఅందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆమె ప్రకటించారు. 50 రోజులపాటు జరిగే ఈ ఆన్లైన్ ప్రొగ్రాంలో డయాబెటిస్ నియంత్రణకు సంబంధించిన అవగాహన, ఆహార నియమాలు సహా వైద్య సహాయానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఫలితంగా మధుమేహం వచ్చే అవకాశాన్ని తగ్గించటంతోపాటు ఇప్పటికీ దీని బారిన పడినవారు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించేలా ప్రోత్సహించవచ్చని డాక్టర్ దీపికా పేర్కొన్నారు.