తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని గంగ పుత్ర యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హిమాయత్‌నగర్‌లో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. గంగ పుత్రుల హక్కులను హరించే విధంగా తలసాని వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు.
'తలసాని శ్రీనివాస్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి' - గంగాపుత్రుల ఆందోళన
గంగ పుత్రులను అవమానించే విధంగా మాట్లాడారని.. వెంటనే మంత్రి పదవి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తొలగించాలని గంగపుత్ర యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
!['తలసాని శ్రీనివాస్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి' fisherman-protest-against-on-minister-talasani-srinivas-yadav-at-himayathnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10211552-thumbnail-3x2-talasani.jpg)
'తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి'
చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు... సంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులను అవమనపరిచాయన్నారు. తలసాని తన మాటలు వెనక్కి తీసుకొని... గంగపుత్ర సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
'తలసాని శ్రీనివాస్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి'
ఇదీ చూడండి:కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారు: తలసాని
Last Updated : Jan 12, 2021, 11:28 PM IST