హైదరాబాద్ సీతాఫల్మండి మత్య్య సహకారం, గంగపుత్ర మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వారసిగూడ చౌరస్తాలో మూడు రోజుల పాటు జరిగిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బౌద్ధ నగర్ నూతన కార్పొరేటర్ శైలజ బెస్త, ప్రజలకు పౌష్టిక ఆహారం చేపల వంటకాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
నేటితో ముగియనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ - Latest news in Telangana
హైదరాబాద్లో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. 3 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో గంగపుత్ర వారి చేపల రుచులు అందరిని ఆకట్టుకున్నాయి.
నేటితో ముగియనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
గంగపుత్ర వారి చేపల రుచులు మూడు రోజుల ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోందని సొసైటీ ప్రెసిడెంట్ స్వర్ణలత బెస్త తెలిపారు. 2020 సంవత్సరం నేటితో ముగుస్తున్న సందర్భంగా రుచికరమైన చేపల రుచులు ఆస్వాదిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదామని సూచించారు.