తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆహా చేప రుచి... తింటున్నారు మైమరచి

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా మహిళా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. పెద్ద ఎత్తున వండి వార్చిన విభిన్న రకాల చేప రుచులు భోజన ప్రియులను మైమరపించాయి.

fish
fish

By

Published : Mar 1, 2020, 6:41 AM IST

Updated : Mar 3, 2020, 2:03 AM IST

రుచికరమైన చేప వంటకాలను తయారు చేస్తూ గంగపుత్రులు.. హైదరాబాద్ నగర వాసులకు నోరూరించే పదార్థాలను వడ్డించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్​ను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 28, 29 సహా మార్చి 1న నిర్వహించిన మూడు రోజుల చేప వంటకాల పండుగ ఘనంగా ముగిసింది.

జంట నగరాలకు చెందిన దాదాపు 500 మంది మహిళా మత్స సహకార సంఘం ప్రతినిధులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందారని సంఘం అధ్యక్షురాలు అరుణ జ్యోతి బెస్త తెలిపారు. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు మత్స్య మహిళా సొసైటీ సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. చేపల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అరుణ అన్నారు.

ఫెస్టివెల్​లో భాగంగా వంటకాలను వేడివేడిగా ప్లేట్లలో అందించారు. విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్​లో లభించే వంటకాల కన్నా... ఇక్కడ వడ్డించిన చేప రుచులు బాగున్నాయని వినియోగదారులు వెల్లడించారు. సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారం అందించారని స్పష్టం చేశారు. ఫెస్టివల్​కు వచ్చే సందర్శకులను ఉత్సాహపరిచేందుకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆహా చేప రుచి... తింటున్నారు మైమరచి

ఇవీ చూడండి :రసాయన పరిశ్రమ గోదాములో భారీ అగ్నిప్రమాదం

Last Updated : Mar 3, 2020, 2:03 AM IST

ABOUT THE AUTHOR

...view details