తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆహా ఏమిరుచి: 28న పసందైన ఫిష్ ఫెస్టివల్

ఈ నెల 28 నుంచి హైదరాబాద్​లో ఫిష్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా ఛైర్​ పర్సన్ పద్మ బెస్త అన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్​ వెస్ట్ మారెడ్ పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిష్ ఫెస్టివల్​ పోస్టర్​ను ఆవిష్కరించారు.

By

Published : Feb 23, 2020, 1:16 PM IST

Updated : Feb 23, 2020, 5:09 PM IST

ఫిష్ ఫెస్టివల్​ పోస్టర్​ను ఆవిష్కరించిన మంత్రి తలసాని
ఫిష్ ఫెస్టివల్​ పోస్టర్​ను ఆవిష్కరించిన మంత్రి తలసాని

హైదరాబాద్ జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఎన్​టీఆర్​ స్టేడియంలో ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఛైర్​ పర్సన్ పద్మ బెస్త తెలిపారు. సికింద్రాబాద్​ వెస్ట్ మారెడ్ పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిష్ ఫెస్టివల్​ పోస్టర్​ను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా సూమారు 30 స్థానిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఈ ఫెస్టివల్ చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.

పోషకాలు పుష్కలం...

పెద్ద ఎత్తున కొవ్వు పదార్థాలుండే చికెన్, మటన్ తింటూ ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ పౌష్టికాహారమైన చేప వంటకాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 28, 29తోపాటు మార్చి 1న ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి చేప ప్రాధాన్యతను తెలియజేయాలనే ఈ వంటకాలను తయారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నగర వాసులకు ఆరోగ్యకరమైన చేప వంటకాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.

ఫిష్ ఫెస్టివల్​ పోస్టర్​ను ఆవిష్కరించిన మంత్రి తలసాని

ఇవీ చూడండి : ట్రంప్‌తో దావత్‌కు.. సీఎం కేసీఆర్​

Last Updated : Feb 23, 2020, 5:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details