Underground Metro in Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త. త్వరలో నగరంలో భూగర్భ మెట్రో రానుంది. త్వరలో చేపట్టబోయే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లైన్లో 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మెట్రో ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న 31 కిలోమీటర్ల కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రారంభమై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారని వెల్లడించారు. ప్రస్తుతం నిత్యం నాలుగు లక్షల 40వేల మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.