టీవీరంగం కళాకారులు, కార్మికుల కష్టాల గురించి అవగాహన ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రంగుల జీవితం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయని వెల్లడించారు. తెలుగు టెలివిజన్, టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెరడేషన్ ఆధ్వర్యంలో ప్రథమ తెలుగు టెలివిజన్ పరిశ్రమ నివేదన సభకు ఆయన హాజరయ్యారు.
రంగుల జీవితం వెనుక ఎన్నో కష్టాలు: మంత్రి ఈటల - మంత్రి ఈటల తాజా వార్తలు
సీఎం కేసీఆర్ ఆలోచనలు ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు గురించే ఉంటాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిత్ర, టీవీ రంగానికి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి సీఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.
ఆలస్యం అవుతుందేమో కానీ అంధకారం మాత్రం ఉండదు: ఈటల
జీవితం కోసం చేసే పోరాటంలో కన్నీళ్లు ఎల్లకాలం ఉండవని మంత్రి ఈటల అన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా పేదల పక్షానే ఉంటుందని... చిత్ర, టీవీ రంగానికి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి సీఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.
Last Updated : Feb 14, 2021, 5:09 PM IST